ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్ - నెలలోగా ఉచిత బస్సు ప్రయాణం - Ramprasad Reddy on Free Bus Scheme

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 5:33 PM IST

Minister Ramprasad Reddy on Free Bus Scheme : నెలలోగా రాష్ట్రంలో మహిళలకు హామీ ఇచ్చిన విధంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్​రెడ్డి తెలిపారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఈ సౌకర్యంపై సమీక్ష చేస్తామని చెప్పారు.  అదేవిధంగా ఉచిత బస్సు కల్పనలో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆర్టీసీలో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై తొలి సంతకం చేశానని ఆయన వివరించారు.

Ramprasad Reddy Took Charge as Minister : రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగుపరుస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ప్రోత్సహిస్తామని చెప్పారు. తనకు మూడు శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు ఆయన రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో నాలుగో బ్లాక్​లోని ఛాంబర్​లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌రెడ్డికి రవాణా, క్రీడల శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.