పూర్తి శాస్త్రీయ పద్దతిలో రిజిస్ట్రేషన్‌ విలువల పెంపు : మంత్రి పొంగులేటి - Ponguleti on Registration Fees Hike - PONGULETI ON REGISTRATION FEES HIKE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 7:19 PM IST

Minister Ponguleti on Registration Fees Hike : పూర్తి శాస్త్రీయ పద్దతిలోనే రిజిస్ట్రేషన్‌ విలువల పెంపు ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ల విషయంలో నాటి ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా ధ్వజమెత్తిన ఆయన, రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో సైంటిఫిక్​గా కాకుండా ఏదో రేట్లు పెంచాలన్న దృక్పథంతో ఒకసారి, మళ్లీ 2022 ఏడాదికి గానూ 6 నెలల్లో రెండుసార్లు గత బీఆర్ఎస్​ పెంచిందని తెలిపారు. రిజిస్ట్రేషన్​ కార్డు విలువలు సైంటిఫిక్​గా పెంచకుండా లంచంగా మార్చిందని ఆరోపించారు. నాటి అసాధారణ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ, శాస్త్రీయబద్ధంగా విలువలు పెంచాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

రిజిస్ట్రేషన్​ ఫీజు పరంగా కాకుండా కార్డు విలువను మార్కెట్​ ధరకు దగ్గరగా ఉంచాలని తాము నిర్ణయం తీసుకున్నామన్నారు. రెవెన్యూతో పాటు పెంచేది చట్టబద్దంగా ఆక్షేపణ లేకుండా కొనుగోలుదారులు, విక్రేతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఒక సైంటిఫిక్​ సిస్టమ్​లో పెంచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఆ వివరాలను అధికారులు 95 శాతం వరకు సేకరించారని, తుది రూపంలో అవి ఉన్నాయని వివరించారు. వీటితో పాటు ఒక థర్డ్​ పార్టీతో కూడా మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. వీటన్నింటిని సరిపోల్చి మార్కెట్​ విలువను నిర్ధారించనున్నట్టు తెలిపారు. దానిపై ఈ స్టాంప్​ డ్యూటీది కూడా ఫిక్స్​ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.