రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు - అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి నిమ్మల - MINISTER RAMANAIDU TELECONFERENCE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2024, 1:23 PM IST

Minister Nimmala Ramanaidu Teleconference  on Rain Alert in AP : రాష్ట్రంలో మరో నాలుగు రోజులు పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో జలవనరులశాఖ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు అప్రమత్తం చేశారు. ఆ శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక‌్కడెక్కడ ఎంత వర్షం పడుతోంది, రిజర్వాయర్లకు ఎంత నీరు వస్తుందో అంచనా వేసి దానికి అనుగుణంగా వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

Rain Alert in AP : వాగులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయులో ఉండి కాలువ గట్ల పటిష్టతకు తగిన చర్యలు చేపట్టాలని రామానాయుడు ఆదేశించారు. బంగాళాఖాతంలో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో 4 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.