ప్రతిపక్ష నేతగా జగన్‌కు అర్హత లేదు- ప్రజల తీర్పు అదే : మంత్రి నిమ్మల - Minister Nimmala Comments on Jagan - MINISTER NIMMALA COMMENTS ON JAGAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 6:06 PM IST

Minister Nimmala Ramanaidu Comments on YS Jagan: పాలనకే కాదు ప్రతిపక్షానికి కూడా జగన్​కు అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. జగన్ తాలిబన్ల లాగా ప్రజలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చకామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్లు మాజీ మంత్రి పేర్ని నానికి కూడా అలాగే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. లోకేశ్ ఏ మంత్రిత్వశాఖలో కల్పించుకోవడం లేదు అని నిమ్మల స్పష్టం చేశారు. మంత్రిగా లోకేశ్​కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే మాజీమంత్రి పేర్ని నాని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్ పాలనలో సకలశాఖల మంత్రిగా సజ్జల వ్యవహరించాడని విమర్శించారు. జగన్ పాలన ఎలా ఉండేదో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్​​ చెప్పారన్నారు. లోకేశ్ విద్యా శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు... ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని వెల్లడించారు.

అదే విధంగా జగన్ ఐదేళ్ల పాలనలో కాలువల్లో పూడికలు కూడా తీయలేదని నిమ్మల మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో జలవనరుల శాఖ అధికారులకు పని లేకుండా పోయిందన్నారు. ప్రకాశం బ్యారేజీకి ప్రవాహం వస్తున్నందున కాలువలకు నీళ్లు విడుదల చేయమని చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్​ఈని బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.