ఆర్డీటీ వల్ల వేల గ్రామాల్లో ప్రజలకు లబ్ధి- సేవలు మరింత విస్తరిస్తాం: లోకేశ్ - Minister Nara Lokesh on RDT - MINISTER NARA LOKESH ON RDT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 7:34 PM IST
Minister Nara Lokesh on RDT: ప్రభుత్వానికి సమాంతరంగా రూరల్ డెవలప్‌మెట్ ట్రస్ట్ (ఆర్డీటీ) అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. 1969లో విన్సెంట్ ఫెర్రర్ ప్రారంభించిన ఆర్డీటీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 వేల గ్రామాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని ఆయన అన్నారు.
RDT Mancho Ferrer meets Nara Lokesh: ఆర్డీటీ నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి చేనేత శాలువాతో ఫెర్రర్‌ని మంత్రి నారా లోకేశ్ సత్కరించారు. వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఏపీ, తెలంగాణలోని పల్లె ప్రజలకు రూరల్ డెవలప్‌మెట్ ట్రస్ట్.. విద్య, వైద్యం, ఉపాధి కల్పిస్తోందని ఆయన కొనియాడారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఆర్డీటీ సేవలు మరింత విస్తరిస్తామని యువగళం పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హామీ ఇచ్చినట్లుగానే రాష్ట్రంలో ఆర్డీటీ సేవలు మరింత విస్తరిస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.