LIVE: విశాఖలో నారా లోకేశ్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - NARA LOKESH MEDIA CONFERENCE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 18, 2024, 5:25 PM IST
|Updated : Oct 18, 2024, 5:50 PM IST
Minister Nara Lokesh Media Conference: వ్యక్తిగతంగా తనపై అసత్య కథనాలు ప్రచురించిన సాక్షి మీడియాపై 75 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన మంత్రి లోకేశ్ విశాఖ కోర్టుకు హాజరయ్యారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు, ప్రతిష్టలకు భంగం కలుగజేసేందుకు అవాస్తవాలతో కథనాలు వేశారని లోకేశ్ తరఫున సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో క్రాస్ ఎగ్జామిన్ కోసం లోకేశ్ కోర్టుకు హాజరయ్యారు.కాగా సాక్షి పత్రికపై న్యాయపోరాటంలో భాగంగా మంత్రి నారా లోకేశ్ గతంలోనూ విశాఖ కోర్టుకు హాజరయ్యారు. అసత్య ఆరోపణలతో తనను కించపరిచేలా కథనం రాశారంటూ సాక్షి పత్రికకు నారా లోకేశ్ నోటీసులు పంపించారు. అయినా ఆ వార్తపై సవరణ ప్రచురించకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో అప్పట్లో పరువునష్టం దావా దాఖలు చేశారు. సాక్షి కథనంలో రాసిన తేదీల్లో తాను విశాఖలో లేనని అయినా అక్కడి ఎయిర్ పోర్టులో ఏవో తిన్నట్లు రాశారని పిటిషన్‌లో లోకేశ్ పేర్కొన్నారు. చాలా రోజులుగా వాయిదా పడిన ఈ కేసు మంత్రి నారా లోకేశ్ క్రాస్ ఎగ్జామినేషన్‌తో మళ్లీ మొదలైంది. ప్రస్తుతం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Oct 18, 2024, 5:50 PM IST