పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం, పీఎం తరహా సెక్యూరిటీ ఉండదు : మంత్రి కొల్లు రవీంద్ర - Kollu Ravindra Fires on Jagan - KOLLU RAVINDRA FIRES ON JAGAN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 2:06 PM IST
Kollu Ravindra Fires on Jagan : భద్రత పెంచాలని వైఎస్ జగన్ అడుగుతుంటే ఆయన నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం, పీఎం తరహా భద్రత ఉండదనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి తెలుసుకోవాలని హితవు పలికారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతిన్న జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Kollu Ravindra Criticisms on YSRCP : రెడ్ బుక్ పేరు వింటేనే వైఎస్సార్సీపీ నేతలు గజగజ వణికిపోతున్నారని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పాపాలు చేసి పారిపోయిన ఆ పార్టీ నేతలు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. సుపరిపాలన కోసం ముఖ్యమంత్రి వాట్సాప్ గ్రూప్లు పెట్టుకోవాలని అధికారులకు సూచిస్తే ఆ విషయాన్ని పేర్ని నాని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అసలు కొడాలి నాని, వంశీలను ఆయనే దాచాడనే అనుమానాలు ఉన్నాయని వివరించారు. ఇలాగే పేర్ని నాని మాట్లాడితే ఏపీ ప్రజలు తిరగబడి కొడతారని కొల్లు రవీంద్ర తెలిపారు.