thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 3:25 PM IST

ETV Bharat / Videos

మెడికల్ అన్‌ఫిట్‌ ఉద్యోగుల నిరసన - ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్

Medical Unfit Employees Protest in Dharna Chowk: మెడికల్ అన్‌ఫిట్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగులు తమ పిల్లలకు వెంటనే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్‌ఫిట్‌ ఉద్యోగులు మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయితే వారి కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పీడీ 19/2015 ప్రకారం సంస్ధ జీవోను విడుదల చేసిందని తెలిపారు. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడి కనీసం వైద్యం ఖర్చులకు కూడా తగిన సంపాదనలేక కుమిలిపోతున్నామని పేర్కొన్నారు. కొంతమంది అధికారుల తప్పిదం వల్ల 150 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

అనారోగ్యంతో బాధపడుతున్న 150 మందిలో దాదాపు 40 మంది వరకు చనిపోవడం జరిగిందని తెలిపారు. హైదరాబాదులోని తార్నాక ఆసుపత్రిలో 12 మంది మెడికల్‌ బోర్డు సభ్యులు ఈడీ అధికారుల సమక్షంలో తమకు వైద్య పరీక్షలు నిర్వహించి సంస్థలో ఏ ఉద్యోగం చేయలేరని బోర్డు సభ్యులు చెప్పిన తరువాతనే మమ్మల్ని మెడికల్‌ అన్​ఫిట్ చేశారని వెల్లడించారు. తాము మెడికల్ ఆన్​ఫిట్ అవ్వటంతో సంపాదనవలేక ఇబ్బంది పడుతున్నామని అందుకే మా పిల్లలకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.