శ్రీకాళహస్తీలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు- ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 6, 2024, 11:47 AM IST
|Updated : Mar 6, 2024, 5:51 PM IST
Maha sivaratri Brahmotsavam at Srikalahasteeshwara temple : దక్షిణ కాశీగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీ శివాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భూతరాత్రిని పురస్కారించుకొని మంగళవారం సోమస్కందమూర్తి, జ్ఞానాంబికలను విశేష రీతిలో అలంకరించారు. వలయాకృతిలో పుష్పాలంకరణలు చేసి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవాన్ని జరిపారు.
Srikalahasti : వృషభరాజాలు, కోలాటాలతో చతుర్మాడ వీధులు పులకించిపోయాయి. గ్రామీణ ప్రాంత కళాకారుల కోలాటాలు, ప్రత్యేక వాయిద్యాలు, శివ భక్తుల నాట్యాలు, వేద పండితుల మంత్రఘోష, మేళతాళాల మధ్య దేవదేవుని ఊరేగింపు ఉత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రద్దీ నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.