మత్స్యకారుడు దుర్గారావు మృతి - అనుమానాలున్నాయన్న మాచర్ల సీఐ - Durgarao
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 1:57 PM IST
Macherla CI Sarath Babu Doubts : పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని బంగారుపెంట తండాలో మత్స్యకారుడు దుర్గారావు మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని మాచర్ల సీఐ శరత్ బాబు తెలిపారు. దుర్గారావు మృతదేహంపై తొలుత ఎలాంటి తాడు లేదని, పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చేలోపు ఉరితాడు ఎలా వచ్చిందని, ఇది ఎలా సాధ్యమని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.
Fisherman Durga Rao Died in Palnadu District : మృతి చెందిన దుర్గారావు బావమరిది, భార్య మాటలకు, ఇచ్చిన ఫిర్యాదుకు పొంతన కుదరడం లేదని సీఐ ఆరోపించారు. కొందరు నాయకులు వారి స్వార్ధం కోసం పోలీసులను ఎరగా వాడుతున్నారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు. పోలీసుల విచారణను తప్పుదోవ పట్టించాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను విచారణ ద్వారా వెలికి తీస్తామని చెప్పారు. వెల్దుర్తి ఎస్ఐపై వచ్చిన అభియోగాలతోనే తనకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇచ్చారని తెలిపారు. తాను విచారణ చేసి వాస్తవాలను వెల్లడిస్తామన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ శరత్‌బాబు తెలిపారు.