ఇంద్రకీలాద్రిపై వైభవంగా లీలా కళ్యాణ మహోత్సవం - Leela Kalyana Mahotsavam
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 9, 2024, 5:10 PM IST
Leela Kalyana Mahotsavam on Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆదిదంపతుల లీలా కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి పురస్కరించుకుని లింగోద్భవ కాలం వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారికి దివ్వ లీలా కల్యాణాన్ని రమణీయంగా, కమనీయంగా ఆలయ అధికారులు జరిపించారు. దేవస్థానం తరపున కనకదుర్గమ్మకు, మల్లేశ్వర స్వామికి ఆలయ ఛైర్మన్, ఈవో పట్టు వస్త్రాలు సమర్పించారు. లీలా కల్యాణాన్ని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో దుర్గమ్మ గుడికి తరలి వచ్చారు.
Mahashivratri Celebrations in Vijayawada : మహాశివరాత్రి సందర్భంగా ఇంద్రకీలాద్రి శివస్మరణతో మార్మోగింది. తెల్లవారుజామున పవిత్ర కృష్ణానదిలో పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటేత్తారు. రాత్రికి గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు శివాలయంలో కవి పండితులు తొలుత ఎదురుకోలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు దుర్గామల్లేశ్వర స్వామి వారికి కల్యాణం జరిపించారు. స్వామి అమ్మవారి కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించారు.