టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య భూవివాదం - ఏఎస్‌ఐపై వైసీపీ నేత దురుసు ప్రవర్తన - Land dispute in Chittoor district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 10:55 PM IST
Land Dispute Between TDP and YCP Leaders in Chittoor District : చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేవదొడ్డిలో వైఎస్సార్సీపీ సచివాలయాల కన్వీనర్ కార్తీక్, టీడీపీ నాయకుడు అమీర్ మధ్య భూ వివాదం తలెత్తింది. ఈ విషయమై ఇరువురు కోర్టుకు వెళ్లగా టీడీపీ నాయకుడికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకుడు అమీర్‌ను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వివాద స్థలంలో నిర్మాణాలు చేపట్టాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు సివిల్ వివాదంలో వైసీపీ నాయకుడికి ఎందుకు సహకరిస్తున్నారని మండిపడ్డారు.
దీంతో వివాద స్థలం వద్దకు వెళ్లిన బైరెడ్డిపల్లి ఏఎస్‌ఐపై (ASI) పై వైసీపీ సచివాలయాల కన్వీనర్ కార్తీక్ దాడికి దిగాడు. రోడ్డుపై ఎందుకు నిర్మాణాలు చేపట్టారని ప్రశ్నించినందుకు ఏఎస్‌ఐపై దురుసుగా ప్రవర్తించి వెనక్కి నెట్టేసాడు. దీంతో అక్కడున్న ప్రజలు వైసీపీ పాలనలో పోలీసులకే భద్రత లేదు, ఇక సమన్యుల పరిస్ధితి ఏంటాని మండిపడ్డారు.