కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీపీ ఆకస్మిక తనిఖీ- సీఐ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశం - CP Inspected krishna Lanka PS - CP INSPECTED KRISHNA LANKA PS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 15, 2024, 11:13 AM IST
krishna CP Inspected krishna Lanka Police Station : విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీపీ రాజశేఖరబాబు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. అడిగిన వివరాలు అందించలేని కృష్ణలంక సీఐ (CI) మురళీకృష్ణ పనితీరు పట్ల సీపీ(CP) అసంతృప్తి వ్యక్తం చేశారు. కంప్యూటర్‌లోని సీసీటీఎన్ఎస్ (Crime and Criminal Tracking Network and Systems) ఓపెన్ చేసి ఎస్హెచ్ఓ (Station House Officer) రోల్ గురించి లాగిన్ అవ్వాలని సీఐను సీపీ ఆదేశించారు. సీపీ ఆదేశానికి అనుగుణంగా సీఐ స్పందించలేకపోయారు. అదే విధంగా స్టేషన్ పరిధిలోని మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల వివరాలు అడగ్గా సీఐ సరైన సమాధానం చెప్పకుండా నీళ్లు నమలటంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల వివరాలు, వాటి సామర్థ్యం, పనితీరు గురించి సీఐ చెప్పలేకపోవడంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మురళీకృష్ణను హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని సీపీ ఆదేశించారు.