ఉద్యోగుల జీపీఎస్ సొమ్మును ప్రభుత్వం కాజేసింది : సూర్య నారాయణ - KR Suryanarayana
🎬 Watch Now: Feature Video
KR Suryanarayana Comment on GPF Funds : ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఐక్యవేదిక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీపీఎఫ్ నిధులపై గతంలో ప్రశ్నించినా ప్రభుత్వం సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు.
Government Employees Meeting in West Godavari : ఆర్థికపరమైన చెల్లింపులకు చట్టాన్ని రూపొందించాలని కోరుతూ గవర్నర్కు వినతి పత్రం కూడా ఇచ్చామని సూర్యనారాయణ తెలిపారు. దీనిని నేరంగా భావించిన ప్రభుత్వం తనను వ్యక్తి గతంగా మానసిక క్షోభకు గురిచేసిందని ఆరోపించారు. ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలను ఛిన్నాభిన్నం చేసే యత్నాలకు పాల్పడిందని మండిపడ్డారు. ఉద్యోగుల్లో చైతన్యాన్ని కలిగించేందుకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు, ఐక్యవేదిక జిల్లా చైర్మన్ జీఆర్ ఎస్ఎన్ రాజు, కార్యదర్శి పీఎస్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.