కంటతడి పెట్టిన కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి- జగన్ వైఖరితో సీమ అభివృద్ది కాలేదంటూ భావోద్వేగం - Kotla Surya Prakash shed tears - KOTLA SURYA PRAKASH SHED TEARS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 18, 2024, 8:42 PM IST
Kotla Surya Prakash Reddy Shed Tears Because no Development : తెలుగుదేశం పార్టీ డోన్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కంటతడి పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లైనా ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కర్నూలు రైతాగంతో పాటు ప్రాంత అభివృద్ది కూడా కుటుంబపడిందని భావోద్వేగం చెందారు. ఈరోజు కర్నూలు జిల్లా కోడుమూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే వేదవతి, గుండ్రేవులకు, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మించాలని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల కాలంలో వీటి గురించి పట్టించుకోలేదని భావోద్వేగానికి గురయ్యి కంటతడి పెట్టారు. కొద్ది సేపు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓదార్చారు.
అయితే కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి టీడీపీ తరపున నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ టికెట్ దక్కిన విషయం తెలిసిందే. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి రైల్వే శాక సహాయ మంత్రిగా పని చేశారు. ఈసారి డోన్ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌కు బలమైన ప్రత్యర్థిగా అసెంబ్లీలో బరిలో దిగుతున్నారు.