LIVE: రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు - మంత్రి కొలుసు పార్థసారథి ప్రెస్ మీట్ - Kolusu Parthasarathy press meet
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 3:30 PM IST
|Updated : Jul 16, 2024, 4:00 PM IST
Andhra Pradesh Cabinet Meeting: రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ భేటీ ముగిసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం దాదాపు రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించింది. ఉచిత ఇసుక విధానం జీవోకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధివిధానాలు ప్రభుత్వం రూపొందించనుంది. పౌరసరఫరాల శాఖ ఇటీవల తీసుకున్న 2 వేల కోట్ల రూపాయల రుణానికి సంబంధించిన ర్యాటిఫికేషన్‌కు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలపైనా కేబినెట్ చర్చించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్‌సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి మంత్రివర్గం ఆమోదించింంది. అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిన దృష్ట్యా పనితీరుపైనా కేబినెట్‌లో సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌పైనా సమావేశంలో చర్చించారు. రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదించారు. ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మంత్రివర్గం నిర్ణయించారు. కేబినెట్ భేటీలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jul 16, 2024, 4:00 PM IST