వైఎస్సార్సీపీ నేతకు కొలికపూడి సవాల్: హౌస్ అరెస్ట్ - తిరువూరు వైఎస్సార్సపీ నేతకు సవాల్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 1:13 PM IST
Kolikapudi Srinivasa Rao House Arrest: సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తిరువూరు వైఎస్సార్సీపీ (YSRCP Coordinator) నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు దంపతుల అవినీతి, అక్రమాలు నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు సవాల్ (Challenge) విసిరారు.
Kolikapudi Challenge To Tiruvuru YSRCP Coordinator: తిరువూరు బోసుబొమ్మ కూడలి వద్దకు ఈరోజు ఉదయం 11 గంటలకు స్వామిదాసు దంపతులు వస్తే చర్చకు సిద్ధమని కొలికపూడి ప్రకటించారు. ఇరువర్గాలు మొహరిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు అప్రమత్తమయ్యి స్వామిదాసు దంపతులు, కొలికపూడిని బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్బంధించారు. దారా పూర్ణయ్య ఎస్టేట్లో నివాస గృహం నుంచి కొలికపూడి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. శాంతి భద్రతల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఏసీపీ మురళీమోహన్ ఆధ్వర్యంలో భారీగా కేంద్ర బలగాలను మోహరించాయి.