జైలు నుంచి ఇంటికి చేరిన కోడికత్తి శ్రీను- తన కోరిక ఏమిటంటే! - కోడికత్తి శ్రీను
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2024, 7:39 PM IST
Kodi Kathi Srinu reached his hometown: జగన్పై హత్యాయత్నం కేసులో అరెస్టై బెయిలుపై విడుదలైన కోడికత్తి శ్రీను, నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలోని తన ఇంటికి చేరుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా జైలుకే పరిమితమై, బైయిల్ పై విడుదలైన జనిపల్లి శ్రీనివాసరావును చూసిన అతని తండ్రి, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. తన విడుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ఐదు సంవత్సరాల కాలంలో జైల్లో ఉండి డిగ్రీ పూర్తి చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఇంకా చదువుతానని తెలిపారు. తన అవసరం తన కుటుంబానికి చాలా ఉందని పేర్కొన్నారు. తాను జైలులో ఉన్న ఈ ఐదు సంవత్సరాలు తన కుటుంబం ఎన్నో ఇబ్బందులకు గురయ్యారైందని తెలిపారు. ఇకపై తన నాకుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అంతకుముందు లాయర్ సలీంతో కలిసి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ చేరుకుని బెయిల్ సంబంధించిన వివరాలను ఎస్ఐకి అందజేశాడు. బెయిల్ నిబంధనల మేరకూ శ్రీనివాసరావు ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసులకు కనిపించాల్సి ఉంటుంది.