నెల్లూరు వైఎస్సార్సీపీకి మరో దెబ్బ - వంటేరు వేణుగోపాల్‌రెడ్డి రాజీనామా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 8:23 PM IST

thumbnail

Kavali Former MLA Vanteru Venugopal Reddy Resignation to YSRCP : వైఎస్సార్సీపీకి కంచుకోట అయిన నెల్లూరు జిల్లాలో బీటలు బారాయి. ఆ పార్టీలోని కీలక నేతలు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. ఇప్పటికే నెల్లూరు నగరం, రూరల్‌ నియోజకవర్గాల కీలక నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. మండల, గ్రామ స్థాయి నాయకులు సైతం అదే బాట పట్టారు. పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి గతంలోనే వైఎస్సార్సీపీని వీడిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా జగన్​కు టాటా చెప్పారు. దీంతో జిల్లాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ సంఘటనలు మరువక ముందే మరో నేత అధికార పార్టీని రాజీనామా చేశారు. దీంతో జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు కరవయ్యారు.

YSRCP Leader Venugopal Reddy Resign : జిల్లాల్లో వైఎస్సార్సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే పార్టీ రాష్ట్ర రాజకీయ సలహా కమిటీ సభ్యులు పదవికి రాజీనామా చేస్తున్నట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు. పది సంవత్సరాలుగా అధికార పార్టీలో ఉంటే సరైన గుర్తింపు లేదని, హీనంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉదయగిరి, కావలి అభ్యర్థుల విజయానికి పని చేశానని ఆయన గుర్తు చేశారు. ఆత్మాభిమానం చంపుకొని పార్టీలో ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.