పోలింగ్ రోజు పాణ్యంలో కాటసాని నరసింహ రెడ్డి వీరంగం - Katasani Narasimha Reddy Atrocities - KATASANI NARASIMHA REDDY ATROCITIES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 14, 2024, 5:25 PM IST
Katasani Narasimha Reddy Atrocities on Polling Day : కర్నూలు జిల్లా పాణ్యం నియెజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయడు కాటసాని నరసింహ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడ్డారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు పాలకొల్లులో టీడీపీ నేతల ఇండ్ల పైకి మరణాయుధలతో వచ్చి భయందోళనలకు గురచేయటమే కాకుండా బూత్‌లోని శివపై దాడి చేశారని ఆరోపించారు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు 4 పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైఎస్సార్సీపీ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా నానిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.