వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలందరూ వేరే రాష్ట్రానికి పారిపోవాల్సిందే: ఆరుద్ర - Kakinada Arudra Fire on YCP Govt - KAKINADA ARUDRA FIRE ON YCP GOVT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 21, 2024, 2:08 PM IST
Kakinada Arudra Fire on YSRCP Government : గత రెండు సంవత్సరాల నుంచి కన్నబిడ్డ ఆరోగ్యం కోసమే ఆ తల్లి జీవన పోరాటం చేస్తోంది. కదల్లేని కుమార్తెకు వైద్యం చేయించాలనే తాపత్రయం. అలాంటి అమ్మ ప్రేమపై మెంటల్ ముద్ర వేసే ప్రయత్నం చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన కాకినాడ జిల్లా రాయుడు పాలేనికి చెందిన ఆరుద్రను బలవంతంగా విశాఖ మానసిక వైద్యాలయంలో చేర్చడం విస్తుపోయేలా చేసింది. న్యాయం చేయాలని రోడ్డెక్కితే ప్రత్యక్ష నరకం చూపించారని రోదిస్తున్నారు ఆరుద్ర. రాష్ట్రం వదిలిపోయేలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీలో మహిళలకు రక్షణ లేదని ఆరుద్ర ఆరోపించారు. క్షేమంగా బతకాలంటే మహిళలంతా రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని అన్నారు. మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే మహిళలు అందరూ వేరే రాష్ట్రానికి పారిపోవడమే అని పేర్కొన్నారు. మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే ఏపీకి తిరిగి వస్తానని ఆమె తెలిపారు.