జర్నలిస్టులపైనే దాడులు జరుగుతుంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ? : జేసీ ప్రభాకర్ రెడ్డి - anantapuram
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 9:37 PM IST
JC Prabhakar Reddy Yuva Chaitanya Bus Yatra : వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికే యువ చైతన్య బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో యువ చైతన్య యాత్రకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ మాట్లాడుతూ, రైతులకు రుణమాఫీ ప్రకటిస్తారని రెండు లక్షల మంది సిద్ధం సభకు వచ్చారు. కానీ, చివరకు ప్రకటనే చేయకుండా అన్నదాతలను జగన్ మోహన్ రెడ్డి తీవ్ర నిరుత్సాహ పరిచారని తెలిపారు. సీఎం దగ్గర చిల్లిగవ్వలేదు, చివరికి ప్రభుత్వానికి అప్పు ఇచ్చే వారు కూడా లేరన్నారు. సిద్ధం సభలో పట్టపగలు సెల్ ఫోన్ల లైట్లు వేయమని ప్రజలను కోరారంటే జగన్ మోహన్ రెడ్డికి పూర్తిగా మతి భ్రమించిందని జేసీ చెప్పారు.
స్థానిక సమస్యల పరిష్కారం దిశగా రానున్న ఎన్నికల్లో మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పప్పూరు నుంచి అరటి పండ్లు విదేశాలకు ఎగుమతి అయ్యేవి, రైతులకు మంచి ధరల లభించేది. కానీ ప్రస్తుతం దళారీల వల్ల రైతులకు సగం ధర రావటం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఇంట పాడి పశువులు ఉండేలా చూస్తమన్నారు. దీనివల్ల జీవనోపాధి మెరుగుపడుతుందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపైనే దాడులు జరుగుతుంటే ఇక సమన్యుల పరిస్థితి ఏంటని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.