ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావటం బాధాకరం- సార్​ మారండి: జేసీ ప్రభాకర్ రెడ్డి - JC Prabhakar Comments On IPS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 5:14 PM IST

JC Prabhakar Comments On IPS Officers : కండీషన్ బెయిల్ మాదిరి ఐపీఎస్ అధికారులు రోజూ డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సి రావటం దురదృష్టకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల్ని, తమని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావటం బాధాకరమన్నారు. అధికారులు ఇప్పటికైనా తీరు మార్చుకుని వ్యవహరిస్తారని ఆశించారు.

వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్​ అధికారులు రోజూ హెడ్‌క్వార్టర్లలో రిపోర్టు చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని సీనియర్ IPSలకు DGP ఆదేశించారు. మొత్తం 16 మంది సీనియర్ IPS అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సందించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.