కష్ట కాలంలో మల్లె రైతులు - పెట్టుబడి కూడా రాలేదని వాపోతున్న కర్షకులు - Jasmine Yield

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 10:47 PM IST

Jasmine Farmers Worried About Proper Yield in NTR District : మార్కెట్​ల్లో మల్లె ధర మెండుగా ఉన్నా సరైనా దిగుబడి లేదని పెట్టిన పెట్టుబడి రాలేదని ఎన్టీఆర్​ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైలవరం మండలం చంద్రగూడెంలో రైతులు ప్రధానంగా మల్లె తోటలను సాగుచేస్తున్నారు. ఇక్కడ నుంచే మల్లెలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. మల్లెపూల సీజన్​ ధరలు అధికంగా ఉన్నా దిగుబడి తక్కువగా ఉంటుందని, దిగుబడి అధికంగా ఉన్నా సమయంలో ధరలు తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ అనుకూలించపోవడంతో దిగుబడులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. మల్లె కావలసిన పురుగుమందులపై ప్రభుత్వం సబ్సిడీ కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

మల్లె సాగుకు ఎకరానికి దాదాపుగా రూ.లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాయని అందుకు తగ్గ రాబడి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అప్పుల బాధ తాళలేక మల్లె తోటలను తొలగిస్తున్నారని వాపోయారు. విజయవాడ మార్కెట్లో పూలను విక్రయించడానికి షాపులను కేటాయించమని ఎమ్మెల్యేను ఎన్ని సార్లు అడిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వచ్చినప్పుడే రైతులు గుర్తుకు వస్తారు, తర్వాత వారి సమస్యలను పరిష్కరించమంటే ముఖం చాటేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.