LIVE: తెనాలిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ భేరి బహిరంగ సభ - ప్రత్యక్ష ప్రసారం - pawan kalyan varahi vijayabheri - PAWAN KALYAN VARAHI VIJAYABHERI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 7:39 PM IST
|Updated : Apr 14, 2024, 9:00 PM IST
PAWAN KALYAN VARAHI VIJAYABHERI: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిన కొనసాగుతోంది. ప్రస్తుతం తెనాలిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ భేరి బహిరంగ సభలో పాల్గొన్నారు. తొలుత సుల్తానాబాద్ నుంచి గాంధీ మార్కెట్ వరకు పవన్ ర్యాలీ కొనసాగింది. మరోవైపు ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ ప్రచారాలు జోరందుకున్నాయి. రాజకీయ పార్టీల వారు ప్రజల్లోకి వెళ్లడానికి వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తొలి దశ ఉమ్మడి ప్రచారం సక్సెస్ జోష్‌తో మలి విడత పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 16, 17వ తేదీల్లో ఇరువురు నేతలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 16వ తేదీన విజయనగరరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. 17న పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ప్రజాగళం ఉమ్మడి సభలు నిర్వహిస్తారు. తాజాగా తెనాలిలోని గాంధీ మార్కెట్ వద్ద బహిరంగసభలో పవన్‌కల్యాణ్ పాల్గొని ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Apr 14, 2024, 9:00 PM IST