'అగ్నిప్రమాదంలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి' - శుభం మహేశ్వరి గోదాము అగ్నిప్రమాదం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 7:21 PM IST
Janasena Nadendla Manohar Letter to Collector In Guntur : తెనాలి శుభం మహేశ్వరి గోదాము అగ్నిప్రమాదంలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు. దీని కోసం గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. రెండునెలల కిందట అగ్నిప్రమాదం జరిగితే ఇప్పటి వరకు అధికారుల కమిటీ నివేదిక ఇవ్వలేదని మండిపడ్డారు. తను గ్రామాల్లో పర్యటించినప్పుడు రైతులు వారి సమస్యను చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారని మనోహర్ తెలిపారు.
Massive Fire Incident in Turmeric Cold Storage At Guntur : కోల్డ్ స్టోరోజ్లో అగ్నిప్రమాదం జరిగి సుమారు 300 మంది రైతుల పసుపు పంట అగ్నికి ఆహుతైందని, అయినా అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం చేసే విధంగా అధికారులు, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.