ఏసీఏ ముసుగులో కోట్ల రూపాయలు దోచుకున్నారు: పీతల మూర్తి యాదవ్ - జనసేన పీతల మూర్తి యాదవ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 12:01 PM IST
Janasena Leader Peethala Murthy Yadav Allegations : సీఎం జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యలు (ACA), కార్యదర్శులు ప్రయత్నం చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. ఫార్మా వ్యాపారం చేసే శరత్ చంద్రారెడ్డి, వస్త్ర వ్యాపారం చేసే గోపీనాథ్ రెడ్డిలు ఏసీఏ ముసుగులో కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Allegations on Andhra Cricket Association Members : భోగాపురంలో పెద్ద స్టేడియం కడతామని 40 ఎకరాలు భూమి కోసం గతంలో ప్రతిపాదన పెట్టారని పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఇప్పుడున్న స్టేడియంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ప్రయత్నం చెందిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఫ్యాన్ పార్క్ పేరు చెప్పి, పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. ఏసీఏ పేరిట ఉన్న ఎఫ్డీలు తాకట్టు పెట్టి బ్యాంక్‌ల నుంచి లోన్లు తీసుకుంటున్నారు. వీటిపై తమ దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయని జనసేన పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయమై తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు.