LIVE : హైదరాబాద్లో జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం - BALINENI PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 28, 2024, 11:05 AM IST
|Updated : Oct 28, 2024, 11:21 AM IST
Balineni Srinivasa Reddy Live : బాలినేని శ్రీనివాసరెడ్డి తన తండ్రి వెంకటేశ్వరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎస్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో కీలక భూమిక పోషించారు. ఒంగోలు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఒకనాడు కాంగ్రెస్, ఆ తర్వాత వైకాపాలో జిల్లా రాజకీయాలను శాసించిన కీలక నేత. విద్యార్థి, యువజన కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో అడుగు మోపారు. ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా వ్యవహరించారు. ఆయన మరణం తర్వాత ఆయన తనయుడు వై.ఎస్.జగన్ వెంట నడిచారు. 2022లో జగన్ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైనప్పటి నుంచీ రగిలిపోయారు. అనంతరం ఆయన జనసేనలో చేరిన విషయం తెలిసిందే. మొదట్నుంచీ విలువలతో కూడిన రాజకీయాలు చేశానని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. తాను జనసేనలోకి వెళ్లడం వల్ల ఒంగోలులో కూటమికి ఇబ్బంది రాదని తెలిపారు. ఇటీవల చిన్న చిన్న వివాదాలు వచ్చాయని, అవన్నీ సర్దుకుంటాయన్నారు. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. తాజాగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Last Updated : Oct 28, 2024, 11:21 AM IST