టిడ్కో ఇల్లు వెంటనే పంపిణీ చేయాలన్న జానీ మాస్టర్​ - జ‌న‌సేన నేత జానీ మాస్ట‌ర్ ధర్నా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 7:35 PM IST

Janasena Jony Master Dharna for  Tidco Houses in Nellore District : జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో పేద‌ల సొంతింటి కల, కలగానే మిగిలిపోయిందని జ‌న‌సేన నేత, ప్రముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ విమర్శించారు. టిడ్కో ఇల్లు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో జనసేన ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జానీ మాస్టర్, టిడ్కో ఇళ్లను (Tidco Houses) పరిశీలించి ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఇల్లు కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్ పేదలను ఇబ్బంది పెడుతున్నారని జానీ మాస్టర్ ధ్వజమెత్తారు.

Jony Master Fire On CM Jagan : ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లన్న జగన్ ప్ర‌భుత్వం, ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. పేదల ఇళ్ల గురించి పట్టించుకోని నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్, నెల్లూరు నుంచి పారిపోయాడని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్​ను ఎవరైనా విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.పేదలకు ఇల్లు ఇచ్చేంతవరకు జనసేన పోరాడుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.