LIVE: మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ప్రజా ప్రతినిధులకు సత్కారం - ప్రత్యక్షప్రసారం - Janasena Honor program - JANASENA HONOR PROGRAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 15, 2024, 12:37 PM IST
|Updated : Jul 15, 2024, 1:50 PM IST
Janasena Honor Program for People Representatives Live: రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ మెజారిటీతో గెలిచి అధికారం చేపట్టింది. జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటి చేసి అన్ని సీట్లను కైవసం చేసుకుంది. అలాగే రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి రెండు లోక్‌సభ స్థానాల్లో సత్తా చాటింది. పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలు, ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీకి సన్మాన కార్యక్రమం చేపట్టారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ ఆయన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే గెలిచిన అభ్యర్థులకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి, పర్యాటకం వంటి ముఖ్యాంశాలను పార్లమెంటులో చర్చకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎంపీలకు సూచించారు. ఈనెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌ని కలిశారు. ఇకపై తనని కలవడానికి వచ్చేవారు విగ్రహాలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలకు బదులుగా కూరగాయలు లాంటివి ఇవ్వాలని కోరారు. కళ్లకు ఇంపుగా, నిండుగా కనిపించేవి కాకుండా పది మంది కడుపు నింపేవి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాగా జనసేన ప్రజాప్రతినిధులతో పవన్‌కల్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జనసేన ప్రజా ప్రతినిధులకు సత్కారం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jul 15, 2024, 1:50 PM IST