LIVE:బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు - మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం - AB Venkateswara Rao taking charge - AB VENKATESWARA RAO TAKING CHARGE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 1:03 PM IST

CS Jawahar Reddy Decision to induct IPS AB Venkateswarao into service : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రింటింగ్‌, స్టేషనరీ అండ్‌ స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌గా ఏబీవీకి పోస్టింగ్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వీసులోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి (Jawahar Reddy) ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఎత్తివేసింది. ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న (AB Venkateswara Rao Retire Today) దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రింటింగ్‌, స్టేషనరీ అండ్‌ స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు  మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీ కోసం 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.