త్వరలో విమానాశ్రయంలో కార్గో సేవలు అందించనున్న ఓమేగా సంస్థ - Interview With VJA Airport Director

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 10:00 AM IST

Updated : Jun 25, 2024, 11:14 AM IST

thumbnail
త్వరలో విమానాశ్రయంలో కార్గో సేవలు అందించనున్న ఓమేగా సంస్థ (ETV Bharat)

Interview With Vijayawada Airport Director Lakshmikanth Reddy: అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమౌతున్న వేళ వివిధ ప్రాంతాల నుంచి రాజధానికి విమాన ప్రయాణికులు పెరుగుతారని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు. గతంలో సింగపూర్‌కు 6 నెలల పాటు విమాన సర్వీసులు అందించామని, మళ్లీ ఇప్పుడు సింగపూర్, థాయ్‌లాండ్‌, శ్రీలంక, దుబాయ్ దేశాలకు సర్వీసులు కావాలని ప్రయాణీకుల నుంచి డిమాండ్ వస్తుందన్నారు. జులై 2 నుంచి విమానాశ్రయానికి సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది భద్రత కల్పిస్తారని చెప్పారు. ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉంటే ఇతర నగరాలకు నేరుగా సర్వీసులు నడిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని వివరించారు. 

ఓమేగా సంస్థ త్వరలో విమానాశ్రయంలో కార్గో సేవలు అందిస్తుందన్నారు. నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్ భవనం ఏడాదిలోగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని అంటున్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి నిర్వహించారు. ఇటీవల విజయవాడ నుంచి ముంబయికు ప్రారంభించిన విమాన సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. 

Last Updated : Jun 25, 2024, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.