'అదే నాకు చివరి రోజు అవుతుందనుకున్నా'- నాటి భయానక అనుభవంపై రఘురామ - RRR Interview - RRR INTERVIEW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 12, 2024, 8:04 PM IST
TDP MLA Raghurama Krishnaraju Interview : ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా పోలీసులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్ పి.వి. సునీల్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. గుంటూరులో తనను కస్టడీకి తీసుకుని హత్యాహత్నం చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు. జగన్ అధికారం కోల్పోయాక నమోదైన తొలి కేసు ఇది. జగన్‌పై కేసు నమోదైన నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు ఈటీవీతో మాట్లాడారు. అరెస్టు రోజున ఏం జరిగిందో, తన అనుభవాలు వివరించారు.
పుట్టిన రోజు నాడే ఏపీ సీఐడీ (A.P.C.I.D) పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారని, అదే రోజు తనకు చివరి రోజూ అవుతుందని అనుకున్నట్లు ఉండి నియోజకవర్గ M.L.A రఘురామ కృష్ణరాజు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెట్టి కస్టడీలో తనను హింసించారని వివరించారు. నాడు ఎంపీగా ఉన్న తనను కిడ్నాప్ తరహాలో అపహరించారని, ఎక్కడా నిబంధనలు పాటించలేదని రఘురామ ధ్వజమెత్తారు. కస్టడీలో తనపై హత్యాయత్నానికి సూత్రధారి జగనేనన్న రఘురామతో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి.