రెండేళ్లైనా పూర్తికాని రోడ్డు - ఇబ్బందులు పడుతున్న స్థానికులు - Two Years Incomplete Road
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 5:13 PM IST
Incomplete Road Works in Parvathipuram Manyam district : పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలో ప్రధాన రహదారి విస్తరణ పనులతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ప్రధాని రహదారిని విస్తరించేందుకు 2022 సంవత్సరంలో ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. 1.2 కిలోమీటర్లు పొడవు 5.5 కోట్ల వ్యయంతో 80 అడుగుల మేర ప్రధాని రహదారిని విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏళ్లు గడుస్తున్నా రహదారి పనులు పూర్తి కాలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Two Years of Incomplete Road Construction : జాతీయ రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాదారులు రాకపోకలు సాగిస్తుంటారు. అసంపూర్తిగా రోడ్డు నిర్మాణం ఉండటం వల్ల దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. రహదారి సమీపంలో ఉంటున్న దుకాణాలు దుమ్ముధూళితో నానా అవస్థలు పడుతున్నారు. రహదారి నిర్మాణ పనులు రెండేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తి కాకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అసంపూర్తిగా ఉన్న రహదారిని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.