టీడీపీలో భారీ చేరికలు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం : పుత్తా నరసింహారెడ్డి - టీడీపీలోకి వంద కుటుంబాలు చేరిక
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 11:37 AM IST
Hundred Families Joined for TDP and Left For YSRCP: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలంలో వైఎస్సార్సీపీని వీడి 100 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీ అధికారంలోకి వస్తుందని నరసింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని గోపలాపురంలో గురువారం రాత్రి "బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరసింహారెడ్డి ఇంటింటికీ వెళ్లి వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీని అందరూ ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మరోసారి వెల్లడించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి ఆయన మహిళలకు వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని కుటుంబాలకు మేలు జరుగుతుందని నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, మాజీ కన్వీనర్ మోహన్ బాబు, మాజీ ఎంపీపీ వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు.