ఆరోగ్యశ్రీ పేరుతో ఆసుపత్రిలో భారీ కుంభకోణం- పర్మిషన్స్ రద్దు
🎬 Watch Now: Feature Video
Huge Scam in Hospital with Name of Arogyashri: కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీగాయత్రీ ఆసుపత్రి(Sri Gayatri Hospital) లో భారీ కుంభకోణం బయటపడింది. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం(YSR Arogyashri Scheme) ద్వారా 2022 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 1,470 మంది పక్షవాత రోగులకు చికిత్స అందించినట్లు తప్పుడు నివేదికలతో ప్రభుత్వ ఖజానికి గండికొట్టారు.
ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జరిపిన విచారణలో ఆసుపత్రి నిర్వహకులు 5 కోట్ల 28 లక్షల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు బయటపడింది. దీంతో అధికారులు ఆసుపత్రి అనుమతిని సస్పెండ్ చేశారు. నిర్వాహకులు జిలానీ బాషా(Jilani Basha), జ్యోతి డయాగ్నోస్టిక్ మేనేజర్ కిరణ్ కుమార్(Jyoti Diagnostic Manager Kiran Kumar)పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నిందితులపై ఐపీసీ 420, 409, 467, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై మోహన్ కిషోర్ రెడ్డి(SI Mohan Kishore Reddy) తెలిపారు.