కాతేరు కదిలింది! - 'రా కదలి రా' కార్యక్రమానికి భారీ జనప్రవాహం - చంద్రబాబు కాతేరు పర్యటన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 1:12 PM IST
Huge People Going to Chandrababu Meeting: పసుపు దళం కదం తొక్కింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'రా కదలి రా' పిలుపునకు వేల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాతేరులో నిర్వహిస్తున్న 'రా కదలి రా' కార్యక్రమానికి అధికంగా తరలివెళ్లారు. నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన సైనికులు వేల సంఖ్యలో కాతేరులోని సభకు తరలి వెళ్లారు.
నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బి. వి. ఎస్. ఎన్ ప్రసాద్ పార్టీ జెండాలతో ర్యాలీ ప్రారంభించారు. బూరుగుపల్లి శేషారావు, ప్రసాద్ అధ్వర్యంలో టీడీపీ జనసైనికులు బైకులు, కార్ల మీద, చంద్రబాబు సమావేశానికి వేల సంఖ్యలో తరలివెళ్లారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ 'రా కదలి రా' కార్యక్రమానికి భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుతూ, సభకు తరలివెళ్తున్న ప్రజలను చూస్తే ప్రభుత్వానికి వణుకు పుట్టడం ఖాయామని అన్నారు. వేల సంఖ్యలో పెద్ద ఎత్తున తరలివచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.