వారపు సంతలో అరుదైన చేపలు - ఒక్కొక్కటి ఎంత బరువంటే ! - Huge Fish Sale at Onukudelli in aob
🎬 Watch Now: Feature Video
Huge Fish Sale at Onukudelli Weekly Market at AOB : ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఉన్న ఒనకడిల్లి వారపు సంతలో భారీ చేపలు విక్రయానికి వచ్చాయి. సాధారణంగా మూడు లేదా నాలుగు కిలోల బరువున్న చేపలు నదిలో సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడ అమ్మకానికి వచ్చిన ఒక్కో చేప సుమారు పది నుంచి పదిహేను కిలోల బరువు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం దిగువన గల నదిలో ఈ భారీ చేపలు లభ్యమవుతున్నాయి. స్థానికంగా ఉన్న గిరిజనుల వలలకు ఈ భారీ చేపలు చిక్కాయి. అరుదుగా దొరికే ఈ చేపల కోసం సంతకు వచ్చినవారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. కిలో రెండు వందల వరకు పలకడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. అరుదుగా దొరికే చేపలు కనుక కొనుగోలుదారులు సైతం సంత బాట పడుతున్నారని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.