ఫిర్యాదుల కోసం పబ్లిక్ ఏరియాల్లో కంప్లైంట్ బాక్సులు- హోంమంత్రి అనిత - Anitha About Complaint Boxes - ANITHA ABOUT COMPLAINT BOXES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 8:23 PM IST
Home Minister Vangalapudi Anitha About Complaint Boxes: రాష్ట్రవ్యాప్తంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేలా ప్రత్యేక ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మండల కేంద్రాలు, కాలేజీలు, పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాటు చేస్తామన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వివిధ శాఖల అధికారులతో అనిత సమీక్ష నిర్వహించారు. అక్రమ లేఔట్లు, పేదల భూములు ఆక్రమించేలా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు.
"ప్రజల ఫిర్యాదులు స్వీకరించేలా ప్రత్యేక పెట్టెలు ఏర్పాటు చేస్తాం. మండల కేంద్రాలు, కాలేజీలు, పబ్లిక్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేలా చర్యలు చేపడతాం. అక్రమ లేఔట్లు, పేదల భూములు ఆక్రమిస్తే ఊపేక్షించబోం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు." - వంగలపూడి అనిత, హోంశాఖ మంత్రి