తరచూ ప్రమాదాలు జరిగే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి అనిత - Home Minister Anita Review
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2024, 10:45 PM IST
Home Minister Anita Review on Prevention of Accidents in Industries: ఇకపై పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు జరగడానికి వీల్లేదని హోంమంత్రి అనిత అన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతపై పరిశ్రమల యాజమానులు, అధికారులతో అనకాపల్లిలో సమావేశం నిర్వహించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే తరుచుగా ప్రమాదాలు జరుగుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశ్రమల్లో భద్రతపై కమిటీ వేసి ఉన్నత స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తామని తెలిపారు. జగన్ పాలనలో పరిశ్రమల భద్రత గాలికి వదిలేసారని మండిపడ్డారు. ఇంతవరకు జరిగింది కాకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పరిశ్రమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తరచూ ప్రమాదాలు జరిగే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిత హెచ్చరించారు.
భద్రత ప్రమాణాలు పాటించాల్సిందే : ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, పరిశ్రమలో భద్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.