ఆదోని పోలీస్‌స్టేషన్‌లో ఇంటి దొంగ- రూ.5 లక్షలు కాజేసిన హోంగార్డు - home guard stole the money - HOME GUARD STOLE THE MONEY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 4:44 PM IST
Home Guard stole the Money From Police Station in Kurnool District : ఎవరైన దొంగతనం చేస్తే పట్టుకొని బుద్ధి చెప్పాల్సిన పోలీసే బుద్ధిలేని పనిచేశాడు. స్టేషన్లో భద్రపరిచిన సోమ్మునే కాజేసి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మనోజ్ అనే వ్యక్తి ఆదోని రెండో పట్టణ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో భాగంగా అక్కడి పోలీసు అధికారులతో సన్నిహితంగా ఉండేవాడు. మనోజ్‌పై నమ్మకంతో బీరువా తాళాలు అతడి చేతికిచ్చి ఫైళ్లు తీసుకురమ్మని చెప్పేవారు అధిాకారులు. అయితే ఆ బీరువాలో వివిధ కేసుల్లో పట్టుబడిన నగదును పోలీసు భద్రపరిచారు. ఆ డబ్బుపై మనోజ్‌కు కన్నుపడింది.
ఈ క్రమంలో ఎవ్వరు లేని సమయంలో బీరువాలో ఉన్న సూమారు రూ. 5లక్షల 63వేల నగదును కాజేశాడు. బీరువాలో డబ్బు లేదన్న విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి ఆ డబ్బును ఇంటి దొంగ మనోజ్ కాజేశాడని నిర్ధరించుకున్నారు. నిందితుడిని అదుపులో తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. హోంగార్డు మనోజ్ నుంచి రూ.3 లక్షల నగదు రికవరీ చేశామని, మిగతా డబ్బును కూడా రికవరీ చేస్తామని పోలీసులు తెలిపారు. అలాగే మనోజ్‌ను రిమాండ్‌కు తరలించామని రెండో పట్టణ పోలీసులు వెల్లడించారు.