కేసుల వివరాలు ఇవ్వాలని కూడా ఆదేశించాలా?- పోలీసుల వైఖరిపై హైకోర్టు అసహనం - police cases on political leaders - POLICE CASES ON POLITICAL LEADERS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 10:19 AM IST
Janasean Manohar VS DGP : రాష్ట్ర పోలీసుల్లో కొందరు అధికార పార్టీకి వీర విధేయులుగా పనిచేస్తున్నారు. చట్టానికి అతీతంగా పనిచేస్తూ పార్టీ పెద్దల మెప్పు కోసం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై కేసుల వివరాలు వెల్లడించకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేశ్ సహా పలువురు నేతలు కోర్టును ఆశ్రయించి కేసుల వివరాలు పొందగా తాజాగా జనసేన నేతలదీ అదే పరిస్థితి.
ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను అందించకుండా వారు హైకోర్టును ఆశ్రయించే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారని డీజీపీ, పోలీసులను హైకోర్టు నేరుగా ప్రశ్నించింది. జనసేన పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌పై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. హోంశాఖ జీపీ మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ కేసుల సమాచారాన్ని పిటిషనర్‌కు శనివారం అందజేస్తామని విచారణను ఈ నెల 22కు వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి విచారణను వాయిదా వేశారు. పిటిషనర్ నాదెండ్ల మనోహర్ తరఫున న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు.