మంత్రి లోకేశ్‌పై హీరో నిఖిల్ ప్రశంసలు - Hero Nikhil in mangalagiri - HERO NIKHIL IN MANGALAGIRI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2024, 5:39 PM IST
Hero Nikhil Participated in Amaravati for all Program in Mangalagiri : ప్రముఖ సినీ హీరో నిఖిల్ మంగళగిరిలో సందడి చేశారు. 'అందరి కోసం అమరావతి' పేరుతో నిర్వహించిన 10కే, 5కే, 3కే రన్‌ను నిఖిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి నారా లోకేశ్ ఒక మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. రోడ్లు, లైటింగ్, శుభ్రత, పరిసరాలు చాలా బాగున్నాయని తెలిపారు. అలాగే విజయవాడకు వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు అద్భుతంగా పనిచేశారని వెల్లడించారు.
సాధారణంగా ఇలాంటి విపత్తులు వస్తే కోలుకునేందుకు చాలా సమయం పడుతుందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టడంతో వరద బాధితులు త్వరగా కోలుకున్నారని వివరించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక వ్యాయామం, క్రీడలో పాల్గొనాలని సూచించారు. త్వరలో కార్తికేయ-3 సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పారు. ప్రస్తుతం స్వయంభూ షూటింగ్ జరుగుతున్నట్లు నిఖిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్‌తో పాటు ఆరో బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబు, కామన్వెల్త్ క్రీడాకారిణి ఘట్టమనేని సాయి పాల్కొన్నారు.