అస్తవ్యస్తంగా రహదారులు- రోడ్డుపైనే దిగబడిపోతున్న వాహనాలు - Heavy Lorry Stuck in Silos on Road - HEAVY LORRY STUCK IN SILOS ON ROAD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 11, 2024, 1:23 PM IST
Heavy Lorry Stuck in Silos on Road At Srikakulam District : శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కొల్లివలస వద్ద పాలకొండ - శ్రీకాకుళం ప్రధాన రహదారిపై భారీ లారీ గోతిలో ఇరుక్కుపోయింది. దాదాపు గంటకు పైగా రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు జేసీబీ ద్వారా వాహనాన్ని పక్కకు తొలగించారు. ఐదేళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో రహదారి గోతులమయంగా మారిందని స్థానికులు తెలిపారు. తరుచూ వాహనాలు భారీ గోతుల్లో కూరుకుపోయి ట్రాఫిక్ స్తంభించిపోతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి రహదారిపై గోతులు పూడ్చాలని విజ్ఞప్తి చేశారు.
గత ఐదు సంవత్సరాలుగా రహదారిలో గోతులు కూడా పూడ్చ లేదని స్థానికులు ధ్వజమెత్తారు. దీంతో పెద్దపెద్ద కోతలు ఏర్పడి వాహనాలు అందులో కూరుకుపోతున్నాయని తెలిపారు. వీటి వల్ల రోడ్డు ప్రమాదాలు విరివిగా జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని అరికట్టిడానికి అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతుమన్నారు. ఈ ఘటనతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.