ఆస్పత్రుల్లో MAY I HELP YOU డెస్క్‌లు- అందుబాటులో మహా ప్రస్థానం వాహనాలు:సత్యకుమార్ - Review on Govt Hospitals in AP - REVIEW ON GOVT HOSPITALS IN AP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-08-2024/640-480-22221788-thumbnail-16x9-health-minister-satya-kumar.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 16, 2024, 6:13 PM IST
Health Minister Satya kumar : పరిమితులతో కూడిన వ్యవస్థతోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించే అంశంపై అంతర్గతంగా సమీక్ష చేసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆస్పత్రులకు నిధులు, పరికరాలు, వైద్యులు, సిబ్బంది కొరత, శానిటేషన్ వంటి సమస్యలు ఉన్నాయని అన్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ మే ఐ హెల్ప్ యూ అంటూ ఫ్రంట్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అరగంటలో ఓపీ సేవలు అందేలా చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం స్థానిక నర్సింగ్ ట్రైనింగ్ కళాశాలల విద్యార్థుల సేవలూ వినియోగించుకుంటామని వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పరికరాలను మెరుగుపరుస్తామని అన్నారు.
సార్వజనిక ఆసుపత్రుల్లో రకరకాల సమస్యలు చాలానే ఉన్నాయని మంత్రి. ప్రభుత్వ ఆస్పత్రుల అంటే సానుకూల దృక్పథం కల్పించాలంటే శానిటేషన్ బాగుండాలని, పరిశుభ్రత అంశాల్లో ఇక ప్రత్యేక దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ఆస్పత్రులకు చాలా మంది నిరక్షరాస్యులు వస్తారని, వారికి కూడా తెలిసేలా సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిాపరు. అంబులెన్స్‌లు, మహా ప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. 108 సిబ్బందిని క్యాజువాలిటి వార్డును అనుసంధానం చేసేలా కార్యాచరణ చేపడతామని అన్నారు. వైద్యుల సమయపాలన విషయంలో కఠినంగానే వ్యవహరిస్తారని పేర్కొన్నారు.