కాస్ట్యూమ్ డిజైనింగ్ పోటీల్లో బంగారు పతకం- దిల్లీలో సత్తా చాటిన తెలుగు తేజం - COSTUME DESIGNING - COSTUME DESIGNING
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-05-2024/640-480-21529764-thumbnail-16x9-costume-designing.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 22, 2024, 1:29 PM IST
Harshita Won Gold Medal in Costume Designing Competition : జాతీయ స్థాయిలో నిర్వహించిన కాస్ట్యూమ్ డిజైనింగ్ పోటీల్లో ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని నూకసాని హర్షిత బంగారు పతకం కైవసం చేసుకుంది. స్కిల్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం న్యూదిల్లీలో జాతీయస్థాయి నైపుణ్య పోటీలు నిర్వహించగా హర్షిత విశిష్ట ప్రతిభ కనబరిచి తాను రూపొందించిన కాస్ట్యూమ్ కు బంగారు పతకం దక్కించుకుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధ్యమైందని హర్షిత ఆనందం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా సీఎస్ పురానికి చెందిన నూకసాని గంగాధరరావు, శారదా పద్మల కుమార్తె హర్షిత. గంగాధరరావు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. హర్షిత పాట్నాలోని నిఫ్ట్ల ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు మూడో సంవత్సరం చదువుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆధ్వర్యంలో శనివారం న్యూదిల్లీలో స్కిల్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కాస్ట్యూమ్ పోటిల్లో హర్షిత ప్రతిభ కనబరిచింది. తాను రూపొందించిన కాస్ట్యూమ్కు బంగారు పతకం దక్కించుకుంది.