మాఘ పౌర్ణమి వేళ సాగర సంఘమానికి పోటెత్తిన భక్తులు - హంసలదీవిలో మాఘ పౌర్ణమి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 4:56 PM IST
Hamsaladeevi Krishna River punyasnanaalu : కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి సమీపంలోని... నదీసాగర సంగమం వద్ద భక్తుల పుణ్య స్నానాలతో సందడి నెలకొంది. మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సముద్ర స్నానాలకు భక్తులు (devotees) పోటెత్తారు.వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సముద్ర స్నానాలు చేసి సూర్య నమస్కారాలతో తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Hamsaladeevi Magha Pournami Celebrations : ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు సిద్ధం చేశారు. హంసలదీవిలో (Hamsaladeevi) కొలువుదీరిన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వెన్నెల కాంతిలో స్వామివారిని దర్శిచుకునేందుకు భక్తులు ఆలయానికి వెళ్తున్నారు. సాగర సంగమం వద్ద గతంలో అధిక ప్రమాదాలు జరగటంతో, ఉన్నతాధికారులు ముందుస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి వృద్దుల, చిన్న పిల్లలకోసం జల్లుల స్థానాలను ఏర్పాటు చేశారు.