యూనివర్శిటీల్లో స్వచ్ఛ భారత్ అమలుకు విద్యాశాఖ సూచనలు జారీ చేయాలి- గవర్నర్ - Governor Couple Planted
🎬 Watch Now: Feature Video
Governor Couple Planted Saplings in Raj Bhavan Campus : రాజ్ భవన్ క్యాంపస్ ప్రాంగణంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు జాక్‌ఫ్రూట్, సంపంగి (మాగ్నోలియా చంపాకా) మొక్కలను నాటారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతులు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా గవర్నర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర విశ్వ విద్యాలయాల కులపతిగా ఉన్న గవర్నర్ అన్ని విశ్వవిద్యాలయాల్లో స్వచ్ఛ భారత్ అమలుకు అవసరమైన సూచనలు జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించారు.
విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర విద్యా సంస్థల్లోనూ డ్రైనేజ్ వ్యవస్థలు, మరుగుదొడ్లు, క్యాంపస్ ప్రాంగణాలు శుభ్రంగా గవర్నర్ ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల క్యాంపస్‌లలో మొక్కలు నాటి నీళ్లు, ఎరువు సరైన సంరక్షణ చూస్తూ జియో ట్యాగింగ్ సాయంతో వాటి ఎదుగుదలను పర్యవేక్షించాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయని ఏపీ సమావేశాల్లో అన్నారు. ఇటీవలే ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌కు సైతం ఆమోదిస్తూ గవర్నర్ ఆర్డినెన్సు జారీ చేశారు.