కూలీల బిడ్డలు - ఫుట్బాల్లో మెరుపులు - Girls Talent in Football - GIRLS TALENT IN FOOTBALL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 10, 2024, 5:57 PM IST
Government School Girls Talent in Football: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని జడ్పీ సెంట్రల్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఫుట్బాల్ క్రీడలో సత్తా చాటుతున్నారు. నలుగురు విద్యార్థినులు శాంతి, అమృత, అంజలి, స్వప్న ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ తమ పిల్లలను చదివిస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థినులు చక్కగా చదువుకుంటూనే వ్యాయమ ఉపాధ్యాయుడు మారుతి ప్రోత్సాహంతో ఫుట్బాల్లో సాధన మొదలు పెట్టారు.
జిల్లా స్థాయిలో ప్రతిభ చాటారు. వారికి ఆర్డీటీ తోడ్పాటు అందించి, శిక్షణ ఇచ్చింది. గత నెల తిరుపతిలో ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించిన సబ్ జూనియర్స్ విభాగంలో జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలిచింది. జట్టులో మొత్తం 18 మంది క్రీడాకారులు ఉండగా వారిలో నలుగురు విద్యార్థినులు కీలకంగా నిలిచారు. వ్యక్తిగతంగా కూడా ప్రశంసలు అందుకున్నారు. గతేడాది విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అమృత చక్కటి ప్రతిభ చాటింది. జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని విద్యార్థినులు సాధన చేస్తున్నారు.