సీఈసీ ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులు - వైసీపీ ప్రచారంలో! - Govt Employees Violating CEC Orders
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 2:01 PM IST
Government Employees Violating CEC Orders: ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనవద్దని కేంద్ర ఎన్నికల కమిషనర్ కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ కొంతమంది ఉద్యోగులు ఆ నిబంధనలను పాటించడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే రాష్ట్రస్థాయి అధికారులు ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. వైఎస్సార్ ఆర్టీసీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డిలు కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేల్ తదితర డిపోలలో పర్యటించి రాబోయే ఎన్నికల్లో జగన్కు ఓటు వేయాలని అక్కడున్న ఆర్టీసీ ఉద్యోగులకు చెప్పడం చర్చానీయాంశంగా మారింది.
జగన్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలు వెలుగులు నింపారని తిరిగి ఆయనకు ఓటెయ్యాలని ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో డిపో అధికారులు పాల్గొనడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడ్ను ఉల్లంఘించిన వారిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు.